- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా ప్రతినిధుల సభకు రిపబ్లికన్ సభ్యుడు మైకె జాన్సన్ కొత్త స్పీకర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. అమెరికా రాజకీయాల్లో గత మూడు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభన ఈ ఎన్నికతో తొలగింది. లూసియానాకు చెందిన మైకె జాన్సన్‌కు మొత్తం 220 ఓట్లకు గాను 209 ఓట్లు వచ్చాయి. మొత్తం 435 మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో 221 స్థానాలతో రిపబ్లికన్లు పైచేయి సాధించారు. డెమొక్రాట్లకు 212 స్థానాలు మాత్రమే వచ్చాయి. 51 ఏళ్ల జాన్సన్ 56 వ స్పీకర్‌గా చరిత్రకెక్కారు. న్యాయవాదిగా ఉన్న జాన్సన్ లూసియానా నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. అమెరికాలో అమెరికా అధ్యక్షుని తరువాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వదవిగా స్పీకర్‌ను పరిగణిస్తుంటారు.
- Advertisement -