Thursday, November 14, 2024

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై

- Advertisement -
- Advertisement -

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం
శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు

Conserve Indigenous Livestock

మనతెలంగాణ/హైదరాబాద్:  స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లో పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ వర్చువల్ విధానంలో హాజరై తన సందేశాన్ని వినిపించారు. మూగజీవాల పోషణ, ఆహార భధ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పశువైద్యుల పాత్ర ఎంతో ఉందన్నారు. స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకునేదిశగా కృషి జరగాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటి డైరెక్టర్ జనరల్ డా.భూపేంద్రనాధ్ త్రిపాటి మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాలను తయారు చేయడం, పశు ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగు పరచడం వంటి వాటిపట్ల దృష్టి పెట్టాలన్నారు. విశ్వవిద్యాలయ ఉప కులపతి డా.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పశువైద్య , విద్యారంగంలో విశ్వవిద్యాలయం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు.

అనంతరం ఈ కార్యక్రమంలో 478మంది విద్యార్దులకు పట్టాలు ప్రధానం చేశారు. ఇందులో 303మంది పశువైద్య విద్యార్ధులు, 56మంది డెయిరీ టెక్నాలజి విద్యార్దులు , 25మంది ఫిషరీ సైన్స్ విద్యార్ధులతోపాటు 68మంది పిజి విద్యార్ధులు , 26మంది పిహెచ్‌డి విద్యార్ధులు ఉన్నారు. ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో పది మందికి బంగారు పథకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు , అకాడమి కౌన్సిల్ సభ్యులతోపాటు రిజిస్ట్రార్ వీరోజి రావ్ , మీడియా కన్వీనర్ ప్రో.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News