Monday, December 23, 2024

పూసల కులస్తులను పట్టించుకోండి : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో 52 జాతులు సంచార జాతులు ఉంటే 14 కులాలను మాత్రమే గుర్తించారని.. వారికి కూడా నిధులు ఇవ్వడం లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద పూసల సంఘం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాల్గొన్నారు. ఎంబిసిలో, డిఎన్‌టిలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కు  నిమ్మరసం ఇచ్చి ఈటల రాజేందర్ విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా కులం పేరు చెప్పడానికే సిగ్గుపడే కులాలు ఎన్నో ఉన్నాయి. అసలే గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. పూసలు అమ్ముకొనే వారికి మీరు ఇచ్చేది ఎంత ?  అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూసల కులాన్ని సంచార జాతుల్లో చేర్చాలని కేంద్రానికి నివేదించి అమలు చేయిస్తాం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News