Wednesday, January 22, 2025

సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం కల్పించండి : సుప్రీం

- Advertisement -
- Advertisement -

Consider Students Plea On Civil Services Exam

న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు రాయలేక పోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఆమేరకు పరీక్షలకు హాజరు కాలేక పోయిన అభ్యర్థులు పెట్టుకున్న అప్పీల్ ను పరిశీలించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. పరీక్ష రాయలేకపోయిన వారికి అదనపు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోర్టు తన సూచనలో పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోర్టు చెప్పింది. పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News