Saturday, July 6, 2024

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: సింగరేణి గనులు దక్కకపోవడానికి కారణం బిఆర్ఎస్, బిజెపియే కారణమని ఉపముఖ్యమంత్రి భట్టు విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి కుమ్మకై కావాలనే సింగరేణి గనులను కేటాయించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ బొగ్గు గనుల కేటాయింపు జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.  గనుల కేటాయింపు జరగనందునే విశాఖ స్టీల్ ప్లాంటులో కార్యకలాపాలు స్తంభించాయని, ప్రైవేట్ పరం అయ్యే స్థితికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కూడా ప్రైవేట్ పరం కావొచ్చని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వేలం పాట ఆపించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ తొమ్మిదేళ్ల పాలన కాలంలో మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహరించినా బొగ్గు గనులను వేలం వెయ్యకుండా కాపాడామని కెటిఆర్ గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News