Wednesday, January 22, 2025

కెసిఆర్‌ను ఎదుర్కోలేక తెరవెనుక కాంగ్రెస్, బిజెపి కుట్రలు: రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి అక్రమ సంబంధం మరోసారి బయటపడిందని రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్,బిజెపిలు కలిసి పని చేస్తున్నాయని కొద్ది రోజుల క్రితమే యెన్నం శ్రీనివాసరెడ్డి అనే నాయకుడు చెప్పాడని, దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు కాంగ్రెస్,బిజెపి ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో రెండు పార్టీలు కలిసి రాజకీయ కుట్రలతో ఎన్నికల్లో వెళ్తున్నాయని, కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలను ఇద్దరు పంచుకున్నారని, ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు.

ఇప్పటికే గజ్వేల్ నుంచి బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాత్రమే బరిలోకి దిగాలని సవాల్ విసరారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు కెసిఆర్ ప్రకటిస్తే ఆయనపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి ఎలా పోటీ చేస్తారని నిలదీశారు.నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి మగాడైతే గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని, లేక పోతే ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కామారెడ్డి నుంచే పోటీ చేయాలన్నారు. రెండు పార్టీల నేతలు కేసీఆర్ గారిపై ఒకే దగ్గర పోటీచేయాలి. అప్పుడే ఎవరి ప్రజాబలం ఏంటో తెలుస్తుందన్నారు. కెసిఆర్‌పై పోటీ అంటే పోలేరమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని అందరికీ తెలుసని అందుకే కాంగ్రేస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా పోటీ నుంచి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. బిజెపితో ఉన్న ఒప్పందం కోసం, వారి ఆజ్ఞలను శిరసావహించాలి కాబట్టి రేవంత్ రెడ్డి గజ్వేల్ లో కాకుండా కామారెడ్డిలో పోటీకి సిద్ధపడ్డారని ఆయన ఆరోపించారు.

కెసిఆర్ మగాడు కాబట్టే సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా టికెట్లు ప్రకటించి బిఫాంలు కూడా అందజేశారుని ఆయన గుర్తు చేశారు. ఒక్కో టికెట్ కు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తున్న నువ్వు కర్ణాటక నుంచి అక్రమ సొమ్ము తీసుకొచ్చి తెలంగాణలో ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నావని  ఆరోపించారు. ఎక్కడ పోటీ చేసినా నిన్ను ప్రజలు తరిమి తరిమి కొడతారు, పరాకాష్టకు చేరిన నీ అవినీతితో.. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీకు డిపాజిట్లు రాకుండా చేస్తారని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News