Monday, December 23, 2024

కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కుట్రలు

- Advertisement -
- Advertisement -

నవీపేట్: మండలంలోని నందిగాం కోస్లి గ్రామాలలో రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబరాలు ఘనంగా జరాగాయి. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆధ్వర్యంలో గొల్ల కురుమలకు రెండవ విడత గొర్రె పిల్లల పంపిణీలో భాగంగా 39 యూనిట్లకు గాను 39 మందికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో పల్లె దవాఖానాన్ని ప్రారంభించారు. క్రిస్టియన్, రెడ్డికా, మున్నూరు కాపు భవనాలకు శంకుస్థాపన చేశారు. కోస్లి, ఫకీరాబాద్ గ్రామాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అహర్నిశలు పేద ప్రజల కోసం పాటుపడుతూ దళితుల కోసం దళిత బంధు, రైతు సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా, ఆడపిల్లల సంక్షేమానికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న స్ఫూర్తి ప్రధాత అని అన్నారు. ఇలాంటి సంక్షేమ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కొన్ని మతతత్వ పార్టీలు చూస్తున్నాయని, కాబట్టి ప్రజలు వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాలని అన్నారు.

అలాగే ప్రజలందరిని తమ బిడ్డలాగా చూసుకుంటున్న కెసిఆర్‌ను తమ బిడ్డగా ఆశీర్వదిం చాలన్నారు. నందిగాం గ్రామంలో గొల్ల కురుమలు గొర్రె పిల్ల, గొంగడితో ఎమ్మెల్యేను సన్మానించారు. కోస్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగెం శ్రీనివాస్, జడ్పిటిసి నీరడి సవిత బుచ్చన్న, వైస్ ఎంపిపి ఇందూర్ హరీష్, గ్రామ సర్పంచులు లావణ్య కిషన్‌రావు, నీలేష్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు వి. నర్సింగరావు, పార్టీ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, సూరిబాబు, అధికారులు ఎమ్మార్వో వీర్‌సింగ్, ఎంపిడివో సాజిద్ అలీ, వివిధ శాఖల అధికారులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News