Thursday, December 26, 2024

నాపై మా పార్టీ నేతల కుట్ర

- Advertisement -
- Advertisement -

ఎంపి టికెట్ రాకుండా అడ్డుకుంటున్న రాష్ట్ర నేతలు
ఆదిలాబాద్ ఎంపి సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ /ఆదిలాబాద్ ప్రతినిధి: తనకు బిజెపి ఎంపి టికెట్ రాకుండా పార్టీ రాష్ట్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆదిలాబాద్ బిజెపి ఎంపి సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. అధిష్టానం రెండో విడతలోనైనా తనకు సీటు కేటాయించాలని కోరారు. రెండవ జాబితాలో తన పేరు ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉంటానంటూ అధిష్టానాన్ని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News