Sunday, January 19, 2025

కోర్టుల పనితీరులో జోక్యం చేసుకునేందుకు కేంద్రం కుట్ర

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఉన్నతన్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ నామినీలను చేర్చాలని కేంద్రం చేసిన ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టుల పని తీరులో జోక్యంం చేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు తాను అనుకూలమని మమత అంటూ, కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను గనుక అంగీకరిస్తే హైకోర్టుల్లో జడ్జీల నియమకం కోసం రాష్ట్రప్రభుత్వం చేసే సిఫార్సులకు విలువ ఉండదని అన్నారు. ఇదో కొత్తరకం కుట్ర.

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్రప్రభుత్వ ప్రతినిధి గనుక ఉంటే అప్పుడు రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులకు కూడా స్థానం కల్పించాలని ఆ ప్రభుత్వాలు కోరవచ్చు. అప్పుడు ఫలితం ఎలా ఉంటుందని ఆమె అంటూ.. రాష్ట్రప్రభుత్వం సిఫార్సుకు విలువే ఉండదు. చివరికి కేంద్రప్రభుత్వం న్యాయవ్యవస్థ పనితీరులో నేరుగా జోక్యం చేసుకుంటుంది. అది మాకు ఇష్ట లేదు’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియమకం కోసం ఏర్పాటయ్యే కొలీజియం వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని కూడా చేర్చాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News