Tuesday, January 14, 2025

గేమ్ చేంజర్ సినిమా పై కుట్ర

- Advertisement -
- Advertisement -

గేమ్ చేంజర్ చిత్రం పైరసీ ప్రింట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసిన వారిపై చిత్ర యూనిట్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాంచరణ్ హీరోగా నటించిన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, శంకర్ డైరెక్షన్ చేశారు. మూడేళ్లకుపైగా కష్టపడి తీసిన సినిమా సంక్రాంతికి విడుదలైంది, విడుదలకు రెండు రోజుల ముందు నిందితులు చిత్ర యూనిట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. తాము చెప్పిన డబ్బులు ఇవ్వాలని లేకుంటే సినిమా ప్రింట్‌ను బయటికి విడుదల చేస్తామని బెదిరించారు. దీనికి చిత్ర యూనిట్ లొంగకపోవడంతో సినిమాలోని కొన్న కీలక సన్నివేశాలను నిందితులు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

తర్వాత వాటిని చూసిన చిత్ర యూనిట్ లీక్‌కు సంబంధించిన ఆధారాలు సేకరించారు, దీని వెనుక 45మందితో కూడిన ముఠా ఉందని తెలుసుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత నిందితులు హెచ్‌డి ప్రింట్‌ను టెలీగ్రాం, సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితుల వివరాలు సేకరించిన చిత్ర బృందం 45మందిపై ఆధారాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి ’గేమ్ చేంజర్’ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News