బ్రిటన్‌లో ఇప్పుడు రాజకుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పలు విషాదకర వార్తలు వ్యాపించాయి. కింగ్ ఛార్లెస్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో మరణించాడని , ప్రభుత్వ అధికారిక భవనాలపై జాతీయ పతాకాలను అవనతం చేశారని పలు రీతులలో తలెత్తిన వార్తలు ఆ తరువాత వదంతులని తేల్చారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో యువరాణి కాటే మిడిల్టన్ చనిపోయ్యారని ప్రచారం జరిగింది. దీనితో సామాన్య ప్రజలలో ఆందోళన తలెత్తింది. వీటికి వెంటనేరాజభవనం అధికారులు రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. చాలాకాలంగా ఛార్లెస్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని చెపుతూ వస్తున్నారు. దీనితో ఆయన చనిపోయారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆయనకు క్యాన్సర్ సంబంధించి ఇతరత్రా విషయాలు ఉన్నాయి. ఆయనకు ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇతరత్రా అవాంఛనీయ విషయాలు కూడా ఏమీ జరగలేదని , ఛార్లెస్ లేదా ఇతర రాజకుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలియచేస్తున్నామని, చికిత్స విషయం ప్రత్యేకమైనదని, దీనిని ఇతర విషయాలతో జోడించి చెప్పడం కుదరదని తేల్చారు. ఇటీవలి కాలంలో సహజంగానే ఛార్లెస్ ఎక్కువగా ప్రజల ముందుకు రావడం లేదు. అయితే అత్యంత కీలకమైన విషయాలలో ప్రధాని రిషిసునాక్‌తో వారంవారం భేటీలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. కెనడా ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిపారు.