Monday, December 23, 2024

ప్రిగోజిన్ హత్యకు కుట్ర

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్ష భవ్నం( క్రెమ్లిన్)నుంచి అందిన ఆదేశాల మేరకే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజెన్‌ను హత్య చేశారంటూ పలు దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఖండించారు. అంతేకాదు ప్రిగోజిన్ మరణాన్ని ధ్రువీకరించడానికి నిరాకరించారు.‘ విమాన ప్రమాదంపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.పాశ్చాత్య దేశాల్లో ఇవి ఒక కోణంనుంచే ప్రసారం అవుతున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు.వాస్తవాల ఆధారంగా వాటిని ప్రసారం చేయడం అవసరం. దర్యాప్తులో భాగంగా వాస్తవాలు వెల్లడవుతాయి’ అని పెస్కోవ్ గట్టిగా బదులిచ్చారు.

ప్రిగోజిన్ మరణాన్ని ద్రువీకరించడానికి నిరాకరించిన ఆయన పరీక్ష ఫలితాలు వచ్చేవరకు ఆగాలన్నారు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పుతిన్, ప్రిగోజిన్ మధ్య సమావేశం జరగలేదన్నారు. ఇదిలా ఉండగా ప్రిగోజిన్ మరణంపైస్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆయన మరణం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదన్నారు.ఈ ఘటన వెనుక పుతిన్ హస్తం ఉందనే అర్థం వచ్చేలా నర్మగర్భంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. దౌత్య సంబంధాల విషయంలో అమెరికా నిర్లక్షాన్ని ఈ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయని మండిపడింది.
విమానంలో బాంబు పేలుడు?
ఇదిలా ఉండగా ప్రిగోజిన్‌ను హత్య చేసి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు సంభవించి ఉంటుందని పేర్కొంది. క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చి వేసి ఉంటారనే వాదనను అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలు తోసిపుచ్చాయి.ఈ మేరకు పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ మాట్లాడుతూ విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటాడని పేర్కొన్నారు. మరో వైపు వాగ్నర్ గ్రూపునకు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ చానల్ కూడా ఇది హత్యేనని చెబుతోంది.అయితేవాగ్నర్ గ్రూపులోని కీలక నేతలంతా ఒకే విమానంలో ఎందుకు బయలుదేరారనేది తెలియడం లేదు. ప్రత్యక్ష సాక్షులు రెండు పేలుళ్లను విన్నారని గార్డియన్ పత్రిక కథనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News