Tuesday, November 5, 2024

కర్నాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర

- Advertisement -
- Advertisement -

గుజరాతీ ద్వయంపై మార్గరెట్ ఆల్వా ఆగ్రహం

బెంగళూరు: కర్నాటక గవర్నర్ తావవర్‌చంద్ గెహ్లాట్‌ను ఉపయోగించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ ఆల్వా ఆరోపించారు. భారత ప్రజలు తమ అధికారానికి కత్తెర వేసిన తర్వాత కూడా గుణఫాఠం నేర్చుకోని గుజరాతీ ద్వయం మళ్లీ తమ ఆటలు మొదలు పెట్టారని మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆమె వారి పేర్లను ప్రస్తావించకుండా ఆరోపించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ సెక్షన్ కింద, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని పెక్షన్ 218 కింద దర్యాప్తు చేసేందుకు అనుమతినిస్తూ ఆగస్టు 16న గవర్నర్ జారీచేసిన ఉత్తర్వులపై ఆల్వా మండిపడ్డారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్న వారు ఇప్పుడు కర్నాటకపైన, ప్రజాదరణ కలిగిన వెనుకబడిన తరగతులకు చెందిన ముఖ్యమంత్రిపైన కన్నేశారని, తమ కుట్రను అమలుచేసేందుకు రాజ్‌భవన్‌లోని తమ సేవకుడిని ఉపయోగించుకుంటున్నారని ఆల్వా ఆరోపించారు.

అయితే రాష్ట్రంలోని కాగ్రెస్ పార్టీ, దాని నాయకత్వం చాలా బలమైనదని, దాన్ని కదిలించడం వారికి సాధ్యం కాదని ఆమె చెప్పారు. 1978లో అప్పటి మొరార్జీదేశాయ్ ప్రభుత్వం కర్నాటకలోని దేవరాజ్ అర్స్ ప్రభుత్వన్నా రద్దు చేసి గవర్నర్ కుట్ర ద్వారా అసెంబ్లీని రద్దు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత అదే గవర్నర్ దేవరాజ్ అర్స్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఆహ్వానించి ప్రమాణం చేయించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. కర్నాటక ప్రజలను మభ్యపెట్టలేరని, తాము సిద్దరామయ్య నాయకత్వంలో పోరాడి గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News