- Advertisement -
పాక్ సమాచార మంత్రి వెల్లడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి శుక్రవారం వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర జరిగినట్లు భద్రతా సంస్థలు వెల్లడించాయని ఆయన చెప్పారు. దీంతో ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఫవాద్ చౌదరిని ఉటంకిస్తూ పాకిస్తాన్ నుంచి వెలువడే ది డాన్ దినపత్రిక శుక్రవారం పేర్కొంది. కాగా..అధికార తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పిటిఐ) నాయకుడు ఫైసల్ వావ్దా కూడా వారం రోజుల క్రితం ఇదే విషయాన్ని తెలిపారు. దేశాన్ని అమ్మడానికి నిరాకరించిన కారణంగానే ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ ఆయన చెప్పారు.
- Advertisement -