Thursday, January 23, 2025

ఖానాపూర్ లో కానిస్టేబుల్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఓ మహిళను మోసం చేసిన ఘటనలో కానిస్టేబుల్ అరెస్ట్ అయిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్ పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న జవ్వాజి రాజేశ్వర్ ఖానాపూర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తున్న లలిత మధ్య గత సంవత్సర కాలంగా ప్రేమ వ్యవహరం నడుస్తుంది. లలిత కు ఒక బాబు కూడా ఉన్నాడు. తన కుమారుడితో లలిత ఖానాపూర్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలు మార్లు శారీరకంగా కలిశాడు.

దీంతో బాధిత మహిళ గర్భవతి కావడంతో కానిస్టేబుల్ ఆబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని మహిళ అడగగా కానిస్టేబుల్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ మనస్థాపంతో గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్ రాజేశ్వర్ ను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News