Tuesday, November 5, 2024

భార్యను వేధించిన కానిస్టేబుల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పనిచేసే పిఎస్‌లోని కేసు నమోదు
అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్: భార్యను వేధింపులకు గురిచేయడంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే కేసు నమోదు కావడంతో సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం…. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్ గతంలో మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించేవాడు. అక్కడే తనతో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొన్నేళ్లు అక్కడే పనిచేశారు.

వీరికి ఒక పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరికి బదిలీ జరగడంతో మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు, శిరీష బేగంపేట పోలీస్ స్టేషన్‌కు ట్రాన్‌ఫర్ అయ్యారు. గొడవలు జరుగుతుండడంతో శిరీష ఫిలింనగర్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటుండగా, మోహన్ మరోచోట ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఇదిలాఉండగానే మోహన్ ఆదివారం అర్ధరాత్రి 1గంటకు శిరీష ఉంటున్న ఇంటికి వెళ్లి తన కూతురిని చూపించాలని గొడవ చేశాడు.

అడ్డు వచ్చిన భార్యతో వాగ్వాదం చేయడంతో పాటు అడ్డు వచ్చిన భార్య సొదరిని నెట్టివేశాడు. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు మోహన్‌పై ఫిర్యాదు చేశారు. మోహన్‌పై పోలీసులు 498ఏ, 458,354,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News