ఉత్తర్వులు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్
లాఠీఛార్జ్ చేసిన కానిస్టేబుల్ శివకుమార్
మనతెలంగాణ, సిటిబ్యూరో: మాస్కు పెట్టుకోని యువకుడిపై లాఠీఛార్జ్ చేసిన భవానీనగర్ కానిస్టేబుల్‌ను సిఎఆర్కు అటాచ్డ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫూ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భవానీనగర్ పోలీసులు తలాబ్‌కట్ట వద్ద ఇంటి బయట ఉన్న ముగ్గురు యువకులను ఇంట్లోకి వెళ్లాలని ఆదేశించారు. అందులో ఓ యువకుడు మాస్కు ధరించకపోవడంతో పెట్టుకోవాలని చెప్పారు. దీంతో యువకులు పోలీసులను దుర్భాశలాడారు. దీంతో పోలీసులు లాఠీలు జులిపించారు. ముగ్గురు యువకుల్లో మహ్మద్ అశ్రఫ్పై కానిస్టేబుల్ లాఠీఛార్జ్ చేయడంతో కంటికి తీవ్ర గాయమైంది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. కర్ఫూ అమలులో ఉందని, ధర్నా విరమించుకోవాలని పోలీసులు చెప్పినా వారు వినకపోవడంతో చెదరగొట్టారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేసి కానిస్టేబుల్‌ను సిఎఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.