Tuesday, January 21, 2025

సిసి రోడ్డును ఆక్రమించిన కానిస్టేబుల్: ప్రశ్నించినందుకు దాడి

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: వరంగల్ నగరానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి రోడ్డును ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడు. అదే కాలనీకి చెందిన వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నాడు. ఇచ్చిన ఫిర్యాదును అధికారులు పక్కకు పెట్టి ఫిర్యాదు ఇచ్చిన అతనిపై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉంది. బుధవారం హనుమకొండ ఏకశిలా పార్కు ఎదుట సమావేశం ఏర్పాటు చేసి వారి గోడును వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రంగశాయిపేటలో జింజిరాల అమర్‌నాథ్ ఒక ప్లాట్ కొనుగోలు చేసి 2000 సంవత్సరంలో ఇల్లు కట్టుకొని కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు.

ఈఇంటికి తూర్పు 20 ఫీట్ల దారి, పడమర దిక్కు 30 ఫీట్ల రోడ్డు పేర్కొంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఉంది. ఆప్రకారమే తను కొనుగోలు చేసిన 139 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెన్కూరి దేవేందర్‌తో వివాదం మొదలైంది. అమర్‌నాథ్ ఇంటికి పడమర భాగంలో గల కొద్దిపాటి స్థలంలో ఈకానిస్టేబుల్ ఇల్లు కట్టుకున్నాడు. అమర్‌నాథ్ ఇంటికి పడమర దిక్కులో గల 30 ఫీట్ల రోడ్డు చివరే కానిస్టేబుల్ ఇల్లు, ఇటువైపు మీకు స్థలం లేదంటూ ఘర్షణకు దిగాడు. దేవేందర్ ఇలా ఒకరినొకరు మాటమాట అనుకున్నారు. పలుమార్లు కూడా అమర్‌నాథ్ భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించగా వెంటనే దేవేందర్‌పై పోలీస్‌స్టేషన్‌లో అమర్‌నాథ్‌ కేసు పెట్టడం జరిగింది.
పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని అధికారులు
ఇదేంటి ఇలా చేస్తున్నావ్ రోడ్డు నువ్వు ఆక్రమిస్తున్నావని అడిగితే నాపైన నాభార్యపై దౌర్జాన్యానికి దిగుతూ నేను లేని సమయంలో నాభార్యపై దాడి చేశాడు. ఈవిషయంపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఒ, మట్టెవాడ ఎసిపికి ఫిర్యాదు చేశామని, అయినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అప్పటి వరంగల్ సిపి తరుణ్‌జోషికి సైతం ఫిర్యాదు చేశామని, అదేవిధంగా డిజిపికి ఫిర్యాదు చేశామని, ఈనేపథ్యంలో సిపి తరుణ్‌జోషి మట్టెవాడ ఎసిపిని విచారణ జరిపి చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించగా

ఈవిచారణ జరిపిన ఎసిపి కానిస్టేబుల్ చెన్కూరి దేవేందర్‌ను ఆయన భార్య మౌనికను బైండోవర్ చేయాలని మిల్స్‌కాలనీ పోలీసులకు సూచించినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎందుకనగా దేవేందర్ కూడా పోలీసే కాబట్టి ఆయన వాళ్లకు సర్దిచెపుతూ కాలయాపన చేస్తూ నిర్లక్షం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేయాలని మీడియా సమక్షంలో అమర్‌నాథ్ దంపతులు గోడును వెళ్లబోసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News