Monday, December 23, 2024

నటి ఎంపి కంగనాపై కానిస్టేబుల్ దాడి

- Advertisement -
- Advertisement -

నటి, బిజెపి కొత్త ఎంపి కంగనా రనౌత్‌పై గురువారం దాడి జరిగింది. స్థానిక విమానాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ నుంచి ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లుతుండగా ఘటన జరిగింది. విమానాన్ని చేరుకునే ముందు తనిఖీల దశలో కంగనాపై ఈ కానిస్టేబుల్ దాడికి దిగినట్లు వెల్లడైంది. ఈ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసు పెట్టి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలీవుడ్ సంచలన నటి కంగనా ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్‌పై గెలిచారు.

తనను కానిస్టేబుల్ పట్టుకుని కొట్టిందని, తిట్టకు దిగిందని ఆ తరువాత కంగనా ఢిల్లీలో తెలిపారు. సెక్యూరిటి చెక్ దశలో అకారణంగా తన ముఖంపై పిడిగుద్దులకు దిగిందని , పంజాబ్‌లో ఈ విధంగా ఉగ్రవాద చర్యలు, హింసాకాండ పట్ల తాను ఆందోళన చెందుతున్నానని కూడా ప్రకటనలో తెలిపారు. పంజాబ్‌లో రైతుల ఉద్యమాన్ని తాను బలపరుస్తున్నానని కానిస్టేబుల్ చెప్పిందని నటి తెలిపారు. ఈ క్రమంలో రైతుల ఉద్యమంలోకి అవాంఛనీయ శక్తులు ప్రవేశించాయనే అనుమానాలు బలోపేతం అయ్యాయని కంగనా చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News