Tuesday, January 21, 2025

మంత్రాలు చేస్తున్నాడని తండ్రిపై దాడి చేసిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రిపై కానిస్టేబుల్ దాడి చేసిన నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో జరిగింది. బుచ్చన్న అనే వ్యక్తి తన కుమారుడు రాజేందర్ ను ఉన్నత చదువులు చదివించాడు. రాజేందర్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో  భీమ్ గల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తండ్రి తన కుటుంబంపై మంత్రాలు చేస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి బుచ్చన్నపై కుమారుడు దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News