Monday, December 23, 2024

సామాన్యుడిపై పోలీస్ కానిస్టేబుల్ రౌడీయిజం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ : కాకి విధులు మరచి… కన్ను పగల గొట్టిన కానిస్టేబుల్ చింతల్‌లో సామాన్యుడిపై పోలీస్ కానిస్టేబుల్ రౌడీయిజం, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై రౌడీ అవతారం ఎత్తాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిని అని మరిచి ఓ కటింగ్ షాప్ నిర్వాహకుడిపై చేయి చేసుకొని ఇష్టం వచ్చినట్లు ముష్టి గుద్దుల్లు గుద్ది కన్నుపై రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. రోడ్డుపై జిహెచ్‌ఎంసి వారు డ్రైనేజీ లైన్ వేస్తుంటే మట్టి ఉంది పక్కన నుంచి వెళ్ళు అని కటింగ్ షాప్ నిర్వాహకుడు సివిల్ డ్రెస్‌లో ఉన్న శ్రీనివాస్ గౌడ్‌కు సూచించాడు. దీనికి కోపంతో ఉగిపోయిన శ్రీనివాస్ గౌడ్ నువ్వేంటి నాకు చెప్పేది అంటూ చేయి చేసుకున్నాడు.

ఈ గొడవలో పరస్పరం వాగ్వాదానికి దిగారు. గొడవపై రెచ్చిపోయిన కానిస్టేబుల్ తన దేహ దారుడ్యాన్ని కటింగ్ షాప్ నిర్వాహకుడిపై ప్రదర్శించాడు. రక్తం వచ్చేలా కొట్టి నేను పోలీస్ కానిస్టేబుల్ ఏమి చేసుకొంటావో చేసుకో అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సిఐ బాధితుడితో మాట్లాడి అనుకోకుండా జరిగింది. చూసుకో అంటూ ఉచితంగా ఓ సలహా ఇవ్వటం కొస మెరుపు, ఇదిలా ఉండగా స్టేషన్ లో బాధితుడికి బాసటగా ఉండాల్సిన సిబ్బంది తమ కాకికి వత్తాసు పలికారు. బాధితుడిని పిలిచి నువ్వు ఎంత చేసిన కేసు పెట్టిన అతనికి ఏమి పెద్ద ఒరిగేది ఏమి ఉండదు గమ్మున కాంప్రమైస్ అవ్వు లేదా మళ్ళీ పెట్రోల్ మొబైల్ డ్యూటీ లో వచ్చినపుడు నిన్ను దృష్టిలో ఉంచుకుంటామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News