Friday, December 20, 2024

కానిస్టేబుల్‌పై రేప్ కేసు

- Advertisement -
- Advertisement -

 

case on constable

ముజాఫ‌ర్‌న‌గ‌ర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కానిస్టేబుల్ విక్రాంత్‌పై రేప్ కేసును బుక్ చేశారు. ఓ మ‌హిళ‌ను పెళ్లి చేసుకుంటాన‌ని హామీ ఇచ్చి, ఆమెతో శృంగారంలో పాల్గొని, ఆ త‌ర్వాత పెళ్లికి నిరాక‌రించిన‌ట్లు ఆ కానిస్టేబుల్‌పై కేసును ఫైల్ చేసి అరెస్టు చేశారు. కాన్పూర్ దీహ‌త్ పోలీస్ స్టేష‌న్‌లో విక్రాంత్ విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అత‌ని స్వ‌స్థ‌లం ముజాఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలోని దోల్రా గ్రామం. ఆదివారం అత‌న్ని షామ్లీలో అరెస్టు చేశారు. మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్‌పై కేసును రిజిస్ట‌ర్ చేశారు. పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామిస్ చేసి త‌న‌ను ఆ కానిస్టేబుల్ రేప్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత అత‌ను పెళ్లికి నిరాక‌రించిన‌ట్లు ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News