Saturday, November 2, 2024

ఇష్టంలేని పెళ్లి…. కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని కార్ఖానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దండగుల ఆంజనేయులు కుటుంబం న్యూ వాసవి నగర్‌లో నివసిస్తోంది. ఆంజనేయులు ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అమ్మాయిపై ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చూపులు నిర్వహించారు. తల్లి పింఛన్ కోసం సొంతూరుకు వెళ్లింది. విక్రమ్‌పూరీ కాలనీలోఉండే సోదరికి పోన్ చేసి నైట్ డ్యూటీ ఉందని చెప్పాడు. గత రాత్రి ఫోన్ చేసిన అతడు స్పందించకపోవడంతో ఇంటి వద్దకు వచ్చి కిటీకిలో నుంచి చూడగా వెలాడుతూ కనిపించాడు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పతికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News