Sunday, December 22, 2024

ఎపిలో విషాదం.. తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఎపిలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ అర్ధరాత్రి తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన శంకర్ రెడ్డి.. ఇటీవలే నంద్యాల జిల్లాకు బదిలీ చేయించుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి పీఎస్​ విశ్రాంతి గదిలోనే శంకర్ రెడ్డి గన్ తో కాల్చుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News