Monday, December 23, 2024

గడ్డి మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రామగిరి: రామగిరి పోలీస్ స్టేషన్‌లో గత సంవత్స కాలంగా విధులు నిర్వహిస్తున్న చిన్నబోనాల గ్రామానికి చెందిన బండ అరుణ్ గడ్డి మందు తాగి ఆత్మాహత్య యత్నం చేసుకున్నట్లు ఎస్‌ఐ రవి ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితో గతంలో మొదటి వివాహం చేసుకున్న అరుణ్ కుటుంబ కలహాల వల్ల విడాకులు తీసుకొని, ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో అతను తన మొదటి భార్య జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తరుచూ బాధపడుతుండేవాడని, దీంతో ఈ నెల 11న తను నివాసం ఉంటున్న సెంటనరీకాలనీ క్వార్టర్‌లో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని సింగరేణి అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని మేడి కవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెంది నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతని భార్య కోమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News