Wednesday, December 25, 2024

పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ ను పొడిచి… ఇద్దరు అరెస్టు… ఒకరు ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని గోవింద్‌పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిరణ్‌పాల్ సింగ్(28) గోవింద్‌పూరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి సింగ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. సంత్ రవిదాస్ మార్గ్ లో కిరణ్‌పాల్ తన బైక్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు స్కూటర్‌పై వెళ్తుండగా అడ్డుకున్నారు.

ముగ్గురు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా తన బైక్‌తో వారి అడ్డుకున్నారు. వెంటనే ముగ్గురు దుండగులు కత్తులతో సింగ్ విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులు దీపక్ మ్యాక్స్(20), క్రిష్ గుప్తా(18)ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుతు రాకీ అలియాస్ రాఘవ్ పారిపోతుండగా కాల్చి చంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News