Wednesday, January 22, 2025

ఎర్రచందనం స్మగ్లర్లు ఎంత పని చేశారు…. కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కెవిపల్లి మండలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతున్నట్టు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఎర్రచందనం వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేశ్ ప్రయత్నించాడు. అదేవేగంతో సదరు కానిస్టేబుల్ ఢీకొట్టి వాహనం ముందుకు వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో పోలీసులు తన కారులో ఎర్రచందనం వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News