Saturday, November 23, 2024

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

బాదంపల్లిలో విషాదచాయలు
పోలీస్‌లాంనాలతో అంత్యక్రియలు

మనతెలంగాణ/జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన కానిస్టేబుల్ గాదె బచ్చున్న (50) గుండె పోటీతో మృతి చెందడంతో స్వగ్రామమైన బాదంపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు గాదె బుచ్చన్న లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ రైటర్‌గా పని చేసిన సమయంలో స్థానిక ప్రజలత్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అక్కడే సొంతగా ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో జీవనం గడుపుతున్నారు. లక్షెట్టిపేటలో పని చేసిన బుచ్చన్న, కాగజ్‌నగర్ 1టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు.

బుచ్చన్నకు భార్య లలీత, కుమారుడు వెంకట‌నర్సయ్య, కుమార్తె సుష్మలు ఉన్నారు. కూతురు సుష్మకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కూతరుకు కుమారుడు జన్మించడంతో 21 రోజుల్లోనే నామకరణం చేయాల్సి ఉండగా పరిస్థితిలు బాగలేక వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈనెల 4 ఆదివారం పురుడు వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి రెండు రోజుల పాటు సెలవుపై లక్షెట్టిపేటకు వచ్చి వేడుకల ఏర్పాట్లు చేయడంలో బుచ్చన్న నిమగ్నమయ్యారు.

శనివారం రోజంతా వేడుకలకు సంబంధించిన పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్న బుచ్చన్నకు గుండెపోటు రావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మనుమని వేడుకలు ఘనంగా చేస్తామనుకున్న తాత బుచ్చన్న ఒక సారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్‌ బృందం స్వగ్రామమైనా బాదంపల్లికి చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మూడు రౌండ్లు పోలీసులు గాలిలో కాల్పులు కాల్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ అంత్యక్రియలో కాగజ్‌నగర్ ఎఎస్‌పి బాలస్వామి, ఇంటలిజెన్స్ డిఎస్‌పి మోహన్, లక్షెట్టిపేట సిఐ నారాయణనాయక్, జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి ఎస్‌ఐలు మధుసుదన్‌రావు, శ్రీకాంత్, దత్తాత్రి, రాథోడ్ తానాజీనాయక్, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News