మంచిర్యాల జిల్లాలో వడదెబ్బ తో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. లక్షేటి పేట పట్టణంలోని అంకతి వాడకు చెందిన ముత్తె సంతోష్ 2000వ బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ వడ దెబ్బతో ఆదివారం రాత్రి సుమారు 11గంటలకు దుర్మరణం చెందాడు. సదరు కానిస్టేబుల్ గత కొన్ని రోజుల నుంచి రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.
Also Read: కర్నాటక కొత్త సిఎం ఎవరో ? ఎంపిక బాధ్యత ఖర్గేకే..
ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువయ్యా యి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీలు, కవ్వాల్ పులుల సంరక్షణ అభయారణ్యం ప్రాంతంలో 45.6 డిగ్రీలు న మోదయ్యాయి. వేమనపల్లి మండలం నీల్వాయిలో 45.5 డిగ్రీలు, ధర్మపురి మండలం జైనాలో 45.5డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరిమెరలో 45.4, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కల్‌లో 45.1, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జుర్‌లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11గంటలకే భానుడు సెగలు కక్కుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాయంత్రం 4గంటల వరకూ వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎండల ధాటికి జనసంచారం పలుచబడుతోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫూ పరిస్థితులను తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు చేస్తున్నారు