Sunday, December 22, 2024

గుండెపోటు తో కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్‌ః కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దయానంద్ (55) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నజ్రుల్‌నగర్ గ్రామపంచాయితీలో బ్లూ కోర్టు విభాగంలో పెట్రోల్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చికుప్పకూలిపోయారు. దీంతో తోటి పోలీసులు గ్రామస్తులు దయానంద్‌ను సమీపంలోని కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రవేట్ అసుపత్రికి తరళించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ డిఎస్‌పి కరుణాకర్, రూరల్ సిఐ నాగరాజు, ఎస్‌ఐ రామన్‌కుమార్‌లు మృతి చెందిన దయానంద్ మృతదేహన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు ఆధికారులు మాట్లాడుతూ డ్యూటిలో ఉన్న దయానంద్ అకాల మరణం బాధాకరమని, శాఖ పరంగా రావాల్సిన సౌకర్యాలను దయానంద్ కుటుంబానికి అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News