- Advertisement -
మన తెలంగాణ/ ఎర్రుపాలెం: స్థానిక పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి.సునిల్ 40 అనారోగ్య కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. గత కొద్ది కాలంగా బాగా ఆలోచన చేస్తూ అయాసపడుతూ కూడా విధి నిర్వహణలో భాధ్యతగా ఉండేవాడని క్రమం తప్పకుండా విధుల్లో పాల్గొంటూ అందరిని నవ్వుతూ పలుకరించే తమ తోటి ఉద్యోగి హఠాన్మరణం చెందడం తమను విషాదంలో ముంచివేసిందని తోటి సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఆదివారం ఖమ్మంలోని తన నివాసంలో మృతుని బౌతిక దేహనికి ఎర్రుపాలెం ఎస్సై సురేష్ తోపాటు పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు నివాళులు అర్పించి కుటుంబానికి డిపార్టుమెంట్ నుండి అన్ని సహయ సహకారాలు అందిస్తామని హామి ఇచ్చారు.
- Advertisement -