Monday, December 23, 2024

దుండగులు విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడంతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కొందరు దుండగులు విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడంతో అతడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విశాల్ పవార్ అనే కానిస్టేబుల్(30) గత ఆదివారం రాత్రి 9.30 గంటలకు విధులకు వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. స్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు డోర్ దగ్గర నిలుచొని ఫోన్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి విశాల్ చేతిని కొట్టాడు. కిందపడిన ఫోన్‌ను ఓ వ్యక్తి తీసుకొని పారిపోతుండగా విశాల్ రైలు దిగి అతడిని వెంబడించాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న కొందరు విశాల్ వద్దకు చేరుకొని అతడి వీపుపై ఇంజెక్షన్ ఇచ్చారు. వారు అతడిని గట్టిగా పట్టుకొని నోట్లో ఎర్రద్రవాన్ని పోశారు. విశాల్ వెంటనే స్పృహ కోల్పోయాడు. తరువాత రోజు మెలకువ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. అతడి కుటుంబ సభ్యుల కొప్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News