Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. రెండో పట్టణ ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాబూజీనగర్ కాలనీకి చెందిన కుంచం సైదులు(30) నల్లగొండలోని 12వ బెటాలియన్‌లో పోలీస్ కా నిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

శనివారం సెలవుపై ఇంటికి వచ్చిన సైదులు ఆదివారం తన ద్విచక్ర వాహనంపై సుమారు 7 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తుండగా, పట్టణంలోని కృష్ణ కాలనీ బైపాస్ వద్ద వెనుక నుండి వచ్చిన టాప్లెస్ లారీ వేగంగా ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద అతని నడుముభాగం నలిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో జరిగిన విషయాన్ని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News