Wednesday, January 22, 2025

కూలర్‌లో నీళ్లు నింపుతుండగా కరెంట్ షాక్.. కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కూలర్ లో నీళ్లు నింపుతుండగా కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మహేంద్ర కుమార్ గా గుర్తించారు. మహేంద్ర కుమార్ ఐటిబిపిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

సెలవులపై ఇంటికి వచ్చి విద్యుదాఘాతంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఎండలు బాగా మండి పోవడంతో ప్రజలు ఇంట్లో చల్లగా ఉండేందుకు కూలర్లు, ఎసిలు వినియోగిస్తున్నారు. వాడకుండా ఉంచిన కూలర్లు, ఎసిలను ఒకసారి సర్వీసింగ్‌ చేయించి వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News