- Advertisement -
షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్ పెట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏ.వెంకటేష్ ( కానిస్టేబుల్ పీసీ నెంబర్ 3826) అంబర్ పెట్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుుకన్నాడు. షేర్ మార్కెట్లో కోటి రూపాయల వరకు లాస్ అవ్వడంతో మనస్థాపానికి గురై అంబర్ పెట్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -