Saturday, January 4, 2025

తెలంగాణలో మరో కానిస్టేబుల్ సూసైడ్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం కిరణ్(36) అనే కానిస్టేబుల్ మలక్‌పేటలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కిరణ్, ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే, కుటుంబ కారణాల వల్లే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కాగా, కిరణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఆత్మహత్య చేసుకునక్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News