- Advertisement -
పరిగి: జీవితంపై విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూఫ్‌ఖాన్‌పేట్ గ్రామ పంచాయతీకి చెందిన వెంకటేష్ (24) పోలీస్ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తూ ఇంటికి వస్తుండేవాడు.
ఇంకా వివాహం కాలేదు. సంబంధాలు చూసిన ఎక్కడ కుదరకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వెంకటేష్ సోమవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. మృతుడి తల్లి ఉప్పటూరి రాములమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద్ చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
- Advertisement -