Thursday, January 23, 2025

నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుల్, హోంగార్డు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Constable fight with Home guard in UP

లక్నో: ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జగమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. కానిస్టేబుల్, హోంగార్డు ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మరో పోలీసు ఆపడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్లు మాత్రం ఒకరిపై ఒకరు ఇద్దరు పిడిగుద్దులు కురుపించుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఇద్దరిని మందలించడంతో పాటు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని, హోంగార్డుపై యాక్షన్ తీసుకుంటామని జలౌన్ ఎస్ పి రవి కుమార్ తెలిపాడు. గొడవలు జరుగుతుంటే ఆపాల్సిన పోలీసులే నడి రోడ్డు తన్నుకుంటే ఎలా? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.  గతంలో యుపిలో ఇద్దరు పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టుకున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News