Wednesday, January 22, 2025

ప్రజావాణిలో ఫిర్యాదు… కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం ఇచ్చిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం వచ్చింది. స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. సిఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్య సత్యలతకు ఉద్యోగం వచ్చింది. కానిస్టేబుల్ సొంగా శేఖర్ విధి నిర్వహణలో చనిపోయాడు. రాచకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ పని చేసేవాడు. పొంగా శేఖర్ భార్య సత్యలత ఎపి మహిళ కావడంతో స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తన కుటుంబ దీనస్థితిని తెలిపింది. నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని డిజిపి, సిపికి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో సత్యలతకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News