- Advertisement -
హైదరాబాద్: కోహెడలో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది. గొర్రెల మందకు కాపలగా ఉన్న కానిస్టేబుల్ పై కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ పరిధిలోని కొహెడలో నవీన్ అనే కానిస్టేబుల్.. తన తండ్రి అనారోగ్యం బారిన పడటంతో నిన్న రాత్రి మరో వ్యక్తితో కలిసి గొర్రెల మందకు కాపలాగా వెళ్లాడు.
ఈ క్రమంలో వారిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి.. 70 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ నవీన్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నవీన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -