హైదరాబాద్: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం సృష్టించింది. పోలీసులపై కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను ప్రభాకర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. నిందితుడి కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకట్‌రామ్‌రెడ్డికి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు చాకచక్యంగా నిందతుడు ప్రభాకర్ రెడ్డిని పట్టుకున్నారు. వెంటనే కానిస్టేబుల్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దొంగ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తెలంగాణ, ఎపిలో 80 కేసుల్లో బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నారు. అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా జర్నలిస్ట్ పై ప్రిజం పబ్ మేనేజ్‌మెంట్ దాడి చేసింది. ప్రిజం పబ్ వద్ద జరిపిన దొంగ కాల్పులు నేపథ్యంలో అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేస్తున్న మహిళ జర్నలిస్ట్, కెమెరా మ్యాన్ పై ప్రిజం పబ్ మేనేజ్ మెంట్, సిబ్బంది దాడి చేశారు.
గచ్చిబౌలిలో కాల్పులు… కానిస్టేబుల్ కు గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -