Thursday, January 23, 2025

మూడేళ్ల పగ… ఎస్ఐని చంపిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మూడేళ్ల నుంచి పగతో రగిలిపోయిన ఓ కానిస్టేబుల్ ఎస్‌ఐని హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని థాణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పంకజ్ యాదవ్ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పంకజ్ తొటి ఉద్యోగితో గొడవ పడడంతో ఎస్‌ఐ బసవరాజ్ సమక్షంలో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పంకజ్‌కు జీతంలో కోత విధించాలని సిపార్సు చేశాడు. మూడే ళ్ల నుంచి పంకజ్ పగతో రగిలిపోతున్నాడు. అదును చూసి బుధవారం ఎస్‌ఐ ఇంట్లోకి చొరబడి బసవరాజ్‌పై పంకజ్ కర్రతో దాడి చేయడంతో ఘటనా స్థలంలో ఎస్‌ఐ దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News