- Advertisement -
రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం చెందాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహి స్తున్న జటావత్ కిరణ్(36) అనే కానిస్టేబుల్ మలక్ పేటలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరి వేసుకొని చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు కిరణ్ 2014 బ్యాచ్ కు చెందిన కానిస్టేబు ల్ గా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీస్ ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపు తున్నాయి. ఇటీవలే ఇద్దరు ఎస్‌ఐలు సహా ఓ హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘట నలు మరవక ముందే బుధవారం మరో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది.
- Advertisement -