హైదరాబాద్: తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నకిష్టయ్య తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 9 నవంబరు 2009న కెసిఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్న సందర్భంలో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. కిష్టయ్య ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకుని కామారెడ్డి పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి 1 డిసెంబర్ 2009న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన కూతురును డాక్టర్ చేయాలని కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలను సిఎం కెసిఆర్ ఇప్పటికే నిజం చేశారు. శనివారం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ప్రియాంక పీజీలో అడ్మిషన్ పొందారు. సిఎం కెసిఆరే తన ఫీజు చెల్లిస్తానని చెప్పారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రియాంక పీజీ చదివేందుకు ఖర్చయ్యే రూ. 24 లక్షలు చెల్లించేందుకు సిఎం కెసిఆర్ అంగీకరించడంతో శనివారం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో పీజీలో అడ్మిషన్ పొందారు.