- Advertisement -
అహ్మదాబాద్ : పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను అక్కున చేర్చుకుని ఆడించింది. తల్లి పరీక్ష రాస్తుండగా, పసికందును కానిస్టేబుల్ ఒడి లోకి తీసుకుని లాలించింది. గుజరాత్ లోని ఓదావ్‌లో ఈ సంఘటన జరిగింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్‌లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. ఆ సమయంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్ద ఈ సంఘటన జరిగింది. సెంటర్‌లో తల్లి పరీక్ష రాస్తుండగా ఏడుపు ఆరంభించిన ఆ శిశువును మహిళా కానిస్టేబుల్ దయాబెన్ చంటిబిడ్డను లాలించడం అందర్నీ ఆకట్టుకుంది.
- Advertisement -