Wednesday, December 25, 2024

ఖమ్మంలో వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రోజు రోజుకు పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు సాగిస్తున్న రాసలీలలు బయటకు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళలతో కానిస్టేబుళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను కానిస్టేబుల్ చెల్లి, బుజ్జి అంటూ దగ్గరయ్యాడు. ఇద్దరు చనవుగా ఉన్నప్పుడు భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు బాంబ్ స్క్వాడ్ లో పని చేస్తున్నాడు. కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదిసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్ లో దొరికాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు. 10 ఏండ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News