- Advertisement -
బెంగళూరు: మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి ప్రయత్నించిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెటగళ్లి పోలీస్ స్టేషన్లో మహబూబ్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. జులై 13న అర్ధరాత్రి సమయంలో మహిళ మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చింది. ఇది గమనించిన కానిస్టేబుల్ ఆమె వెనకాలే వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో ఘటనా స్థలం నుంచి కానిస్టేబుల్ పారిపోయాడు. నజరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -