Sunday, January 19, 2025

దళిత యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యాచారం…

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఇద్దరు కానిస్టేబుళ్లు మరో ముగ్గురుతో కలిసి దళిత యువతిపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినంసంఘటన రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖజువాలా ప్రాంతంలో 20 ఏళ్ల దళిత యువతి కంప్యూటర్ నేర్చుకోవడానికి కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. దినేష్ బిష్ణోయ్ అనే వ్యక్తి గత 15 రోజుల నుంచి వెంటపడుతున్నాడు. భగీరత్ బిష్ణోయ్, మనోజ్ బిష్ణోయ్ అనే కానిస్టేబుళ్ల కోచింగ్ సెంటర్ వద్ద యువతిని కిడ్నాప్ చేసి దినేష్ బిష్ణోయ్ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ముగ్గురు కలిసి మరో ఇద్దరుతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. యువతిని చంపేసి ఖజువాలా సినిమా హాల్ వద్ద ఆమె మృతదేహాన్ని పడేశారని ఆమె తండ్రి ఆరోపణలు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఇదిగో.. పేదల ఆత్మగౌరవ సౌధం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News