Thursday, December 26, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలోని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్ తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఉదయం 5 గంటలకు డ్యూటీకి హాజరై గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News