Wednesday, December 18, 2024

కలెక్టరేట్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: గన్‌తో కాల్చుకుని ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గన్‌తో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కాల్చుకున్నాడు. పోలీస్ సిబ్బంది సమాచారం మేరకు జిల్లా ఎస్‌పి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో పని బారంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News